గవర్నర్ నరసింహన్ కి అస్వస్థత…

Monday, August 19th, 2019, 09:50:50 PM IST

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ నేడు కొద్దిసేపటిక్రితం తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ఒక్కసారిగా వాంతులు, తలనొప్పితో తీవ్రంగా బాధపడ్డారు. కాగా తక్షణమే స్పందించిన ఆయన సిబ్బంది ఆయనని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కాగా గవర్నర్ ని పరీక్షించిన వైద్యులు తనకి ఎలాంటి ప్రమాదం లేదని, సాధారణ అస్వస్థతతే అని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతానికి గవర్నర్ నరసింహన్ బీహార్ రాష్ట్రంలోని బుద్దగయా లో తన సతీమణితో సహా పర్యటిస్తున్నారు. కాగా నేడు ఉదయం గవర్నర్ కి వాంతులు మొదలయ్యాయి. వెంటనే అధికారులు ఆయన్ను గయలోని మెడికల్ కాలేజీ ఆసత్రికి తరలించగా, సమీపించిన అక్కడి వైద్యులు రక్త పరీక్ష, ఈసీజీ, మరియు సంబంధిత ఇతర చికిత్సలు చేశారు. కాగా ఆ పరీక్షల్లో రిపోర్టులో ఎలాంటి సమస్య రాలేదని, అది కేవలం సాధారణంగా వచ్చిన అస్వస్థత అని, బయపడాల్సింది ఏమిలేదని వైద్యులు వెల్లడించారు. కాగా ప్రాథమిక చికిత్స అనంతరం కోలుకున్న నరసింహన్ తిరిగి తన సతీమణి విమలతో కలిసి ఢిల్లీకి వెళ్లిపోయారు. కాగా ఢిల్లీకి వెళ్లిన ఆయన మన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ తో భేటీ అయ్యి ఆ తరువాత హైదరాబాద్ కి పయనమవుతరాని సమాచారం.