చంద్రబాబు కి ఎంతో పేరు తెచ్చిపెట్టిన పథకానికి జగన్ ముగింపు.

Friday, December 13th, 2019, 09:40:41 AM IST

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. అయితే చంద్రబాబు హయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జన్మభూమి కమిటీలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2014 లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసారు. గ్రామ, మండల, జిల్లా, స్థాయిలో జన్మభూమి కమిటీలను అపుడు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్దిదారుల్ని ఎంపిక చేసే బాధ్యత చంద్రబాబు అపుడు వీరి ఫై పెట్టేవారు.

అయితే ఈ కమిటీల విషయం లో అప్పట్లో ప్రతిపక్ష పార్టీ వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. అయితే టీడీపీ కార్యకర్తలకు, అభిమానులకు లబ్ది చేకూరేలా జన్మభూమి కమిటీలు పని చేసాయి అని వైసీపీ అప్పట్లో ఆరోపణలు చేయడం జరిగింది.అయితే జగన్ ప్రభుత్వం తాజాగా జన్మభూమి కమిటీలను రద్దు చేసింది. ఆ స్థానంలోనే గ్రామ వాలంటీర్లని నియమించారు.