యాభై కోట్ల క్లబ్ లోకి .. శాతకర్ణి బాలయ్య ?

Sunday, January 29th, 2017, 01:07:48 PM IST

gouthamiputhra
నందమూరి బాలకృష్ణ తన వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి తో ఓ గొప్ప ప్రయత్నం చేసాడు. అఖండ భారతావనిని పాలించిన తెలుగు రాజైన గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత కథ మరుగున పడిపోయింది .. దాన్ని మళ్లి తెలుగు ప్రజలు గుర్తు చేసుకునేలా చేసాడు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి వసూళ్లు సాధించింది. హేమ మాలిని, శ్రియ ముఖ్యపాత్రల్లో నటించిన శాతకర్ణి సినిమా అటు ఓవర్ సీస్ లోకూడా దుమ్ము రేపి, ఈ సినిమాతో బాలయ్య యాభై కోట్ల మార్కెట్ లోకి చేరుకున్నాడు… మరి గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా 15 రోజుల కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ..
నైజాం – 9. 05 కోట్లు ,
సీడెడ్ – 7. 10 కోట్లు ,
ఉత్తరాంధ్రా – 4. 45 కోట్లు ,
గుంటూరు – 4. 06 కోట్లు ,
కృష్ణ – 2. 86 కోట్లు ,
ఈస్ట్ – 3. 52 కోట్లు ,
వెస్ట్ – 3. 32 కోట్లు ,
నెల్లూరు – 1. 65 కోట్లు ,
కర్ణాటక – 3. 75 కోట్లు ,
రెస్ట్ అఫ్ ఇండియా – 1. 25 కోట్లు ,
ఓవెర్సెస్ – 7. 12 కోట్లు ,
మొత్తంగా – 48. 23 కోట్లు.