బ్రేకింగ్ : పవన్ విషయంలో అసలు రంగు బయటపెట్టిన “భీమవరం” ఎమ్మెల్యే.!

Saturday, June 8th, 2019, 05:12:44 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసి ఓడిన నియోజకవర్గాల్లో భీమవరం కూడా ఒకటి. గాజువాక మరియు బీమవరం రెండు నియోజకవర్గాల్లో పవన్ పోటీ చేయగా ఎక్కడైతే పక్కాగా గెలుస్తారు అనుకున్నారో అక్కడ భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు.కానీ భీమవరంలో మాత్రం గెలుపు ఖాయం అనుకున్నా సందర్భంలో అనేక అనుమానాల నడుమ ఓటమి పాలయ్యారు.అయితే అక్కడ పవన్ పై పోటీ చేసి నెగ్గిన వైసీపీ అభ్యర్థి ఇప్పుడు తన మనసులో ఉన్న మాటను బయటపెట్టి సంచలనం రేపారు.

సరిగ్గా ఎన్నికలకు ముందు గ్రంథి శ్రీనివాస్ తాను కూడా పవన్ అభిమానినే అని అలా అని అప్పుడు తనపై పోటీ చేస్తే పవన్ ఖచ్చితంగా ఓడిపోతారని కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం తప్పకుండా ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నానని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.అయితే అదంతా భీమవరంలో ఉన్నటువంటి పవన్ అభిమాన ఓటర్లను తన వైపుకు తిప్పుకునేందుకు చేసిన ఒక మైండ్ గేమ్ అని తాజాగా ఆయన చేసిన కామెంట్స్ వింటే అర్ధం అవుతుంది.

పవన్ అంటే అసలు అతనికి ఎలాంటి అభిప్రాయం ఉందో తన మనసులో ఉన్న అసలు మాటను బయటపెట్టి తన అసలు రంగు ఇది అని నిరూపించుకున్నారని పవన్ అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో అంటున్నారు.ఇటీవలే ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా కాదు కదా ముఖ్యమంత్రిగా అస్సలు కాకూడదని ఆ దేవుణ్ణి తాను ప్రార్ధిస్తున్నాని అతను ముఖ్యమంత్రి కానీ అయితే అరాచకాలు విపరీతంగా పెరిగిపోతాయని చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు.ఒకప్పుడు ఇదే పవన్ కు తాను అభిమానిని అని చెప్పుకొని ఇప్పుడు అతని నిజస్వరూపం ఏంటో బయటపెట్టుకున్నారని జనసేన శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.