ఓరోరి ఫ్రెండూ.. కుచేలుడా రారా!!

Saturday, October 13th, 2018, 12:08:55 PM IST

ఇదిగో ఈ ఫోటోలో క‌నిపిస్తున్న ఫ్రెండ్సుని చూశారా? శ్రీ‌కృష్ణుడు- కుచేలుడు త‌ర‌హా. ఈ స్నేహం ఇప్ప‌టిది కాదు. చిన్న‌ప్ప‌టి నుంచి క‌లిసే తిరిగారు. ఎవ‌రి కెరీర్‌లో వాళ్లు ఎదిగారు. ర‌జ‌నీ చిన్న‌నాటి స్నేహితుడి పేరు రామ‌కృష్ణ‌. ర‌జ‌నీ రాజ‌కీయారంగేట్ర‌మే కాదు, సినీ ఆరంగేట్రానికి ఆయ‌న వెన్నుద‌న్నుగా నిలిచాడు. రాజ‌కీయాల్లో ర‌జ‌నీ లాంటి నిస్వార్థ రాజ‌కీయ నాయ‌కుడు రావాల్సిందేన‌ని కోరాడు. ఇటీవ‌లే ర‌జ‌నీని రామ‌కృష్ణ క‌లిసిన‌ప్ప‌టి దృవ్య‌మిది.

ఈ ఫ్రెండ్స్ స్ఫూర్తితో ఓమారు శ్రీ‌కృష్ణుడు- కుచేలుడు క‌థ‌లోకి వెళ్లాలి. బండెడు సంతానముతో దరిద్రబాధ అనుభవించిన‌ ఉంటే కుచేలుడి భార్య లోక రక్షకుడైన శ్రీకృష్నుడిని దర్శనం చేసుకొని రమ్మంటుంది. కుచేలుడు ద్వారకా నగరము బయలు దేరబోయే ముందు కుచేలుని భార్య ఒక చిన్నఅటుకుల మూట కట్టి ఇస్తుంది. కుచేలుడు ద్వారక నగరము చేరుకొని అక్కడ ఉన్న దివ్యమైన భవనాలు రాజప్రాకారాలు చూసి ఈ రాజధానిలో నన్ను శ్రీకృష్ణుడిని కలవనిస్తారా అని సందేహ పడతాడు. తన మదిలో లోక రక్షకుడిగా భావించే శ్రీకృష్ణుడి దర్శనం లభిస్తుంది. శ్రీ కృష్ణుడు కుచేలుడిని స్వయంగా రాజ సభలోకి ఆహ్వానించి ఉచితాసనం ఇచ్చి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తన శిరస్సు పై చల్లుకొంటాడు. ఆ విధంగా ఉపచారాలు అందుకొంటున్న కుచేలుడిని చూసిన సభలో ఉన్నవారు కుచేలుడి అదృష్టాన్ని కొనియాడుతారు.

సపర్యలు అయ్యాక కుచేలుడీతో శ్రీకృష్ణుడు చిన్ననాటి జ్ఞాపకాలు జ్ఞప్తికి తెచ్చుకొని ఒకసారి మన గురు పత్ని దర్భలు తెమ్మని పంపితే వర్షము పడడం వల్ల ఎంతకు రాక పోవడం వల్ల మన గురువుగారు మనల గురించి ఎంత కంగారు పడ్డారు అని కుచేలుడితో అంటాడు. తరువాత శ్రీకృష్ణుడు కుచేలునితో తనకు ఏమైన తీసుకొని వచ్చావా అని అడుగుతాడు. కుచేలుడు సిగ్గుతో తాను తెచ్చిన అటుకుల మూట దాచు తుంటే శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికి ఆ అటుకులు తింటాడు. రెండవ మారు మళ్ళీ ఆటుకులు గుప్పెటితో తిన బోతుండగా రుక్మిణి స్వామి మీరు మొదటి సారి అటుకులు తినడంవల్లే కుచేలునికి సర్వసంపదలు కలిగాయి అని చెబుతుంది. ఆ తరువాత కుచేలునికి వీడ్కోలు పలుకుతాడు. అదీ నాటి క‌థ‌.