స్ట‌న్నింగ్ : నేస్త‌మా ఈ స్నేహం.. ఎప్ప‌టికీ ఇలానే!

Thursday, March 8th, 2018, 08:33:45 PM IST

ఈ స్నేహం స్ట‌న్నింగ్‌.. మైండ్ బ్లోయింగ్‌.. ఇల‌లో క‌ల‌లో క‌న‌లేనిది. క‌ల‌లోనైనా క‌ర‌గ‌నిది ఈ స్నేహం. ఇహ‌లోకంలో ఎంద‌రు ఉన్నా.. దోస్తానాని మించిన వాళ్లు ఉంటారా? అస్స‌లు ఛాన్సే లేదు. ఇదిగో ఇక్క‌డ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా అందాల శ్రుతిహాస‌న్‌ని హ‌గ్ చేసుకున్న తీరు చూస్తుంటే .. ఇంత‌కుమించిన గ్రేట్ ఫ్రెండ్స్ ఉండ‌ర‌ని అంగీక‌రించి తీరాలి.

ఈగోయిస్టిక్ ప్ర‌పంచంలో.. ర‌స్టిక్ బ్రూట‌ల్ వ‌ర‌ల్డ్‌లో.. స్నేహం పేరుతో గొంతు కోసే ఈ పాపిష్టివాళ్లున్న‌చోట‌.. ఇలాంటి స్నేహితులు కూడా ఉంటారా? అనేంత‌గా ఇంప్రెస్ చేస్తోంది క‌దూ? ఇండ‌స్ట్రీలో ఇద్ద‌రు మ‌ధ్య స్వ‌చ్ఛ‌మైన స్నేహం ఎంద‌రికో స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిద్దాం. శ్రుతితో త‌న అనుబంధానికి సూచిక‌గా ఉన్న ఈ ఫోటోని షేర్ చేయ‌డ‌మే కాదు.. అంతే ఉద్వేగంతో ట్వీట్ కూడా చేసింది. “నేటి ఉమెన్స్ డే వేళ‌ నేనొక విష‌యం చెప్పాల‌నుకుంటున్నా. మ‌నం ఎప్పుడు క‌లిసినా ఎంతో ప్రేమతో ఉన్నాం. ఇలా ఓ కొత్త‌ లైఫ్‌ని ప‌రిచ‌యం చేశావు. దీనిని ఎప్ప‌టికీ ఇలానే కొన‌సాగించు. నేస్త‌మా నీపై అపార‌మైన‌ ప్రేమ‌తో ….“ అంటూ ట్వీట్ చేసిన త‌మ‌న్నా… నువ్వు నాకు స్నేహితురాలు కావ‌డం నా అదృష్టం అంటూ ఆ ఫోటోపై రైట‌ప్‌ని ఉంచింది. ఇద్ద‌రు ఆడాళ్ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంద‌ని ఎవ‌రండీ ఆ మాట అన్న‌ది?