బాలయ్య ఊర్లో పంచాయతీ..ఇంతకీ పీఏ ఏంచేసాడు..?

Tuesday, January 31st, 2017, 05:52:01 PM IST

balakrishna
నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే గా హిందూపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. సొంత నియోజగక వర్గంలో బాలయ్యకు సమస్యలు మొదలయ్యాయి.నియోజకవర్గంలో పార్టీ పరమైన విషయాలన్నీ బాలయ్య పీఏ శేఖర్ చూస్తుండడంతో వివాదంగా మారుతోంది.ప్రభుత్వపరమైన విషయాల్లో పార్టీ వ్యవహారాల్లో శేఖర్ జోక్యం ఎక్కువగా ఉండడంతో సొంత పార్టీ నేతలే అతడి పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు తదితర మండలాలలోని టిడిపి నాయకులంతా ఏకమై శేఖర్ ని నియోజకవర్గం నుంచి బయటకు పంపడానికి పథకాలు రచిస్తున్నారు.ఈ నెల 25 న చిలమత్తూరులో జరిగిన జాతర సందర్భంగా కొందరు నేతలు మాజీ సర్పంచ్ సోమశేఖర్ ఇంట్లో సమావేశం అయ్యారు. శేఖర్ కు వ్యతిరేకంగా రహస్య భేటీలు జరుపుతూ నియోజకవర్గం లోని అసంతృప్తులంతా ఏకం అవుతున్నారు.బాలయ్యకు శేఖర్ పై ఎలాగైనా ఫిర్యాదు చేయాలనీ వారంతా భావిస్తున్నారు.