విశాల్ కి దెబ్బ పడింది.. మోడీ రివేంజ్..?

Tuesday, October 24th, 2017, 01:55:24 AM IST

తమిళ ప్రముఖ హీరో విశాల్ పై జీఎస్టీ బృందం కొరడా ఝుళిపించింది. విశాల్ ఆఫీస్ లో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం రెండు గంటలకు అధికారుల సోదాలు మొదలయ్యాయి. విశాల్ నిర్మాణ సంస్థకు సంబందించిన లావాదేవిలని అధికారులు పరిశీలించారు. జీఎస్టీ చెల్లింపులో అవకతవకలు జరిగినట్లు సందేహాల నేపథ్యంలో అధికారులు విశాల్ కార్యాలయాన్ని శోధించినట్లు తెలుస్తోంది.

కాగా ఈ దాడుల వెనుక బిజెపి హస్తం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బిజెపి నేత హెచ్ రాజాపై విశాల్ ఘాటు వ్యాఖ్యలు చేసి 24 గంటలు తిరగకముందే ఈ దాడులు జరగడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. పైగా విశాల్ మెర్సల్ చిత్రానికి మద్దతుగా నిలిచాడు. తాను మెర్సల్ చిత్ర పైరసీ కాపీని చూశానని రాజా తెలిపారు. దీనితో విశాల్ రాజాపై దుమ్మెత్తి పోశాడు. బాధ్యతాయుతమైన పదవిలో వుండి పైరసీ చూశానని చెప్పుకుంటున్నావ్.. నీకు అసలు సిగ్గు ఉందా అంటూ విశాల్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా మెర్సల్ చిత్రంలో జీఎస్టీ కి వ్యతిరేకంగా పెట్టిన డైలాగులకు కూడా విశాల్ మద్దతుగా నిలిచాడు.

  •  
  •  
  •  
  •  

Comments