పోస్ట‌ర్ టాక్‌ : హౌ క్రియేటివ్ గూఢ‌చారి?

Sunday, November 5th, 2017, 01:40:52 AM IST

యువ‌హీరో అడివి శేష్ తొలినుంచి ప్ర‌యోగాల బాట‌లోనే ఉన్నాడు. ఆరంభ‌మే `క‌ర్మ‌` అనే విల‌క్ష‌ణ‌మైన క‌థాంశాన్ని ఎన్నుకుని, ఆ చిత్రానికి అన్నీ తానే అయ్యి తెర‌కెక్కించాడు. హీరో, ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత‌గా త‌న‌ని తాను నిరూపించుకున్నాడు. ఆ క్ర‌మంలోనే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `పంజా` చిత్రంలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌తో ఆక‌ట్టుకున్నాడు. అటుపై కెరీర్ ప‌రంగా వెనుదిరిగి చూసిందే లేదు. బాహుబ‌లి చిత్రంలో భ‌ళ్లాలుని కొడుకు పాత్ర‌లో న‌టించి మెప్పించాడు.

ఇక శేష్ సోలో హీరోగా న‌టించిన `క్ష‌ణం` పెద్ద స‌క్సెసైంది. ఈ సినిమా చిన్న సినిమాల్లోనే ది బెస్ట్ మూవీగా సంచ‌ల‌నం సృష్టించింది. అందుకే శేష్ ఓ సినిమాలో న‌టిస్తున్నాడు అన‌గానే కాస్తంత యువ‌త‌రంలో క్యూరియాసిటీ నెల‌కొంటుంది. ప్ర‌స్తుతం శేష్ న‌టిస్తున్న `గూఢ‌చారి` ఆన్‌సెట్స్ ఉంది. ఈ సినిమాకి సంబంధించి తాజాగా మోష‌న్ పోస్ట‌ర్‌, టైటిల్‌ని ఆవిష్క‌రించారు. క్ష‌ణం ర‌చ‌యిత నుంచి వ‌స్తున్న మ‌రో చిత్ర‌మిదంటూ పోస్టర్‌లో హైలైట్ చేయ‌డం ఈ సినిమాకి పెద్ద ప్ల‌స్‌. అభిషేక్ పిక్చర్స్-విస్టా డ్రీమ్ మర్చంట్స్-పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో శశికిరణ్ తిక్క దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అడివి శేష్ సరసన మిస్ ఇండియా అయిన మన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అడివి శేష్ కథ సమకూర్చడం విశేషం. వేస‌విలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

  •  
  •  
  •  
  •  

Comments