అరవింద సమేత ప్రీ రిలీజ్ కి అతిధులు ఎందుకు రాలేదు.?

Tuesday, October 2nd, 2018, 08:20:06 PM IST

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తున్న చిత్రం “అరవింద సమేత వీర రాఘవ”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలు ఈ రోజు భారీ స్థాయిలో జరుగుతున్నాయి.త్రివిక్రమ్ ఎన్టీఆర్ కంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు ఎక్కువయ్యాయి.అదే సందర్భంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకు ముందు అంతా బాలకృష్ణ వస్తారని వార్తలొచ్చాయి.ఒకానొక సందర్భంలో ఐతే బాలయ్యతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారని పుకార్లు షికార్లు కొట్టాయి.

కానీ ఈ రోజు కట్ చేస్తే అరవింద సమేత ప్రీ రిలీజ్ కి ఏ అతిధులు లేరు.అంతా సాదా సీదాగానే జరిగిపోతుంది.ఎప్పటిలాగే త్రివిక్రమ్ అన్ని చిత్రాల్లాగే ఎలాంటి అతిధులు లేకుండానే కేవలం వారి చిత్ర యూనిట్ మరియు అభిమానుల సమక్షంలో జరుపుకుంటుంది.మరి దీనికి ముందు బాలయ్య ఈ చిత్రం ప్రీ రిలీజ్ కి వస్తారు అన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలయ్య వద్దామనుకున్నా రాలేని పరిస్థితి.తాను తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు తాను ఈ వేడుకకి రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.ఈ చిత్రాన్ని ఈ నెల 11న భారీ స్థాయిలో విడుదల చెయ్యడానికి సంసిద్ధం చేస్తున్నారు.