‘గుంటూరోడు’ గా వ‌స్తున్న హీరో ఎవ‌రంటే!

Friday, September 30th, 2016, 05:58:27 PM IST

manoj
క‌థ‌ల‌తోనే కాదు.. సినిమాల పేర్ల‌తోనూ క‌ట్టిప‌డే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. పోస్ట‌ర్‌పై పేరు చూడ‌గానే ప్రేక్ష‌కుడు థియేట‌ర్ల‌కి క‌దిలిరావాల‌నే వ్యూహంతో ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు ఆస‌క్తిక‌ర‌మైన టైటిళ్లని పెడుతున్నారు. తాజాగా మంచు మ‌నోజ్ కథానాయ‌కుడిగా న‌టిస్తున్న ఓ చిత్రానికి కూడా అలాంటి ఆస‌క్తిక‌ర‌మైన `గుంటూరోడు` అనే టైటిల్‌ని నిర్ణ‌యించారు. నా రాకుమారుడు ఫేమ్ ఎస్‌.కె.స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో మ‌నోజ్ఓ చిత్రం చేస్తున్నాడు. అందులో ప్ర‌గ్యా జైశ్వాల్ క‌థానాయిక‌. ఆ చిత్రానికే గుంటూరోడు అనే టైటిల్ పిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. మనోజ్గుం టూరు కుర్రాడిగా క‌నిపిస్తాడ‌ని, అందుకే ఆ పేరును నిర్ణ‌యించార‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆ చిత్రంతో పాటు మంచు మ‌నోజ్ `ఒక్క‌డు మిగిలాడు` కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగులు స‌మాంత‌రంగా జ‌రుపుకొంటున్నాయి. పెళ్లి వ‌ల్ల మ‌నోజ్ కాస్త వెన‌క‌బ‌డిపోయాడు. ఈ రెండేళ్ల‌ల్లో ఎక్కువ‌గా సినిమాలు చేయ‌లేదు. ఆ లోటుని పూడ్చేలా ఇప్పుడు వ‌రుస‌గా సినిమాలు ప్లాన్ చేసుకొన్నాడు.