గుంటూరు టాకీస్ సీక్వెల్ లో బొద్దు గుమ్మా ?

Wednesday, December 28th, 2016, 12:56:46 PM IST

namitha
సౌత్ ప్రేక్షకులకు తన బొద్దు అందాలతో ఆకట్టుకున్న హాట్ భామ నమితకు ఈ మధ్య పెద్దగా అవకాశాలు రావడం లేదు. అడపా దడపా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ భామకు ఒక్క తమిళంలోనే కాస్త క్రేజ్ ఎక్కువ. ఆ మధ్య తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘సింహ’ సినిమాలో మెరిసిన ఈ భామ చాలా రోజుల తరువాత మళ్ళీ తెలుగు తెరపై తన అందాలు ఆరబోసేందుకు రెడీ అయింది. ఇంతకీ ఆమె నటిస్తున్న సినిమా ఎదో తెలుసా .. ”గుంటూరు టాకీస్ 2 లో !! ఆ మధ్య సంచలనం రేపిన ‘గుంటూరు టాకీస్’ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ భామ సన్నీ లియోన్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఆమెతో పాటు మరో కీలక పాత్రకోసం నమితను సంప్రదించినట్టు తెలిసింది. ఆ పాత్ర నమిత చేస్తే ఇంకా బెటర్ అనే ఉద్దేశంలో ఉన్నారట దర్శక నిర్మాతలు, ఇప్పటికే ఆమెతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మరి ఈ సినిమాకు నమిత ఓకే చెప్పిందంటే .. గుంటూరు టాకీస్ సీక్వెల్ గ్లామర్ షో తో అదిరిపోవడం ఖాయం !! ఏమంటారు ?

  •  
  •  
  •  
  •  

Comments