హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఈటల ఓడిపోవడం ఖాయం – గుత్తా సుఖేందర్‌రెడ్డి

Thursday, June 10th, 2021, 08:38:38 PM IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై శాసనమండలి మాజీ చైర్మన్, టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈటలకి సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఉన్నత పదవులు కట్టబెట్టారని అన్నారు. ఈటల తనని తాను రాజకీయంగా నాశనం చేసుకున్నారని, రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలనేవి ఉండవని అన్నారు. అయితే ఈటల ఆత్మరక్షణ కోసం కాదు, ఆస్తులు రక్షణ కోసమే బీజేపీలోకి వెళ్తున్నారని అన్నారు.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఈటల ఓడిపోవడం ఖాయమని, ఆయన్ని ఆ దేవుడు కూడా గెలిపించలేరని అన్నారు. అయితే మరో 20 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, 2026 ఎన్నికల్లో రిజర్వేషన్లు మారుతాయని అన్నారు. ఇకపోతే దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ గ్రాఫ్ పడిపోయిందని, మొన్న 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి పరాభవం ఎదురయ్యిందని అన్నారు.