హాజీపూర్ హత్య కేసు : త్వరలో కీలక తీర్పు…

Thursday, December 12th, 2019, 10:01:13 PM IST

గత కొద్దీ రోజుల క్రితం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకరకమైన సంచలనాలని సృష్టించినటువంటి హాజీపూర్ హత్యల కేసులో నేడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ ప్రస్తుతానికి పూర్తయిందని సమాచారం. అయితే ఈ దారుణమైన ఘటన కి సంబందించిన విచారణ గత అక్టోబర్ 14 నుంచి జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో కోర్టు తీర్పు వెల్లడవనున్నట్లు సమాచారం. అంటే ఈ నెలాఖరు వరకు తీర్పు వెలువడనున్నట్లు తెలుస్తుంది. కాగా ఈకేసులో మర్రి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన నిందితుడు. అయితే ఈ మృగాడు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో ముగ్గురు బాలికలను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన అప్పట్లో పెద్ద దుమారం రేపింది. కాగా ముగ్గురు మహిళలతో పాటు మరో మహిళ హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి కి వ్యతిరేకంగా గ్రామస్తులందరూ కూడా వ్యతిరేకంగానే సాక్ష్యం చెప్పారు. ఈమేరకు చట్టపరంగా, న్యాయమైన శిక్ష పడుతుందని గ్రామస్తులందరూ కూడా భావిస్తున్నారు.