హైదరాబాద్ లో సగం వరకు పోలింగ్ పూర్తి…

Friday, December 7th, 2018, 04:30:16 PM IST

నేడు తెలంగాణా అంతటా కూడా పోలింగ్ ఉహించినద్దని కంటే కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది. తెలంగాణలోని మొత్తం 119 స్థానాల్లో పోలింగ్ సక్రమంగానే జరుగుతుందని అధికారులు తెలియజేశారు. నేటి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 48.09 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈసారి ఓటర్ల జాబితా కూడా పెరిగిందని, అందుకనే ఎక్కువగా ఓటింగ్ నమోదవుతుంది వెల్లడించారు. ఉదయం 11 గంటలకే గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం ఓటింగ్‌ నమోదైంది. కానీ హైద్రాబాద్లో మాత్రం ఓటింగ్ అంత సాజావుగా సాగట్లేదు. పోలింగ్ సమయం పూర్తయ్యేలోగా అందరు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటారని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండగా, 1821 మంది అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలకి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మొత్తం 2.81 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలకి గాను 1.90 లక్షల మంది భద్రతా సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు రక్షణ కల్పిస్తున్నారు. ఈ ఎన్నికలలో ప్రధానంగా తెరాస మరియు ప్రజకూటమికి పోటీ బాగా ఉంది. ఇరు పార్టీ లు కూడా తెలంగాణా;లో అధికారం కోసం తీవ్రంగా కష్టపడుతున్నాయి. మరోవైపు భాజపా, బీఎల్‌ఎఫ్‌, ఎంఐఎం సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇప్పటికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కేంద్రాల్లో మినహా అన్ని చోట్ల ఎన్నికలు ప్రశాంతంగానే జరుగుతున్నాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు.