మేనేజ‌ర్ జీతం ఎగ్గొట్టిన‌ హ‌న్సిక?

Wednesday, March 14th, 2018, 07:49:47 PM IST

పాల‌బుగ్గ‌ల హ‌న్సిక ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో బిజీ నాయిక అన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా హ‌న్సిక ఊహించ‌ని వివాదంలోకి వ‌చ్చింది. హ‌న్సిక‌ త‌న మేనేజ‌ర్‌కు జీతం ఇవ్వ‌కుండా ఎగ్గొట్టింద‌ని, ఆ మేర‌కు న‌డిగ‌ర‌సంఘంలో ఫిర్యాదు న‌మోదైంద‌ని తెలుస్తోంది. హ‌న్సిక‌ మేనేజ‌ర్ మునుస్వామి ఫిర్యాదులో కొంతవ‌ర‌కూ నిజం ఉంద‌ని న‌డిగ‌ర‌సంఘం భావించి విచార‌ణ చేప‌ట్టింద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే హ‌న్సిక న‌డిగ‌ర‌సంఘంలో వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంటుంద‌న్న ప్ర‌చారం కోలీవుడ్‌లో సాగుతోంది. హ‌న్సిక ఎంత‌కాలంగా జీతం ఇవ్వ‌డం లేదు అనే విష‌యంపై నడిగ‌ర‌సంఘం విచారించ‌నుంది. ఇక‌పోతే ప్ర‌స్తుత సంక‌ట‌ప‌రిస్థితిలో హ‌నీ కాల్షీట్ల‌ను త‌న త‌ల్లిగారైన‌ హ‌న్సిక మోత్వానీ చూస్తున్నారు.

హ‌న్సిక ప్ర‌స్తుతం విక్ర‌మ్ ప్ర‌భు స‌ర‌స‌న `తుప్పాక్కి మునై` అనే చిత్రంలో న‌టిస్తోంది. మ‌ణిర‌త్నం శిష్యుడు దినేష్ సెల్వ‌రాజ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.