టాలీవుడ్ పై ఆశలు పెట్టుకున్న హన్సిక ?

Thursday, June 7th, 2018, 01:24:09 AM IST

దేశముదురు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బొద్దుగుమ్మ హన్సిక ఇక్కడ చాలా సినిమాలు చేసి ప్రస్తుతం కోలీవుడ్ లో సెటిల్ అయింది. తమిళ ప్రేక్షకులకు కాస్త బొద్దుగా ఉండే హీరోయిన్స్ ఇష్టం కాబట్టి అక్కడే వరుసగా అవకాశాలు అందుకుంది. అయితే ఈ మధ్య ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలన్నీ వరుసగా ప్లాపులు అవుతుండడంతో కొత్త అవకాశాలు తగ్గాయి. దాంతో వొళ్ళు తగ్గి స్లిమ్ గా మారేందుకు తెగ కసరత్తులు చేసింది. ప్రస్తుతం స్లిమ్ గా మరీనా హన్సిక ఫోకస్ ఇప్పుడు టాలీవుడ్ పై పడిందట. తెలుగులో మంచి అవకాశాల కోసం చూస్తుంది. ఇప్పటికే కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టిన ఈ అమ్మడు త్వరలోనే మంచి అవకాశాలు అందుకునే దిశగా దూసుకుపోతుంది.

  •  
  •  
  •  
  •  

Comments