అందుకే .. అలా చేశానంటున్న హన్సిక ?

Monday, February 13th, 2017, 11:55:33 PM IST


ఈ మధ్య హన్సిక పై వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. హన్సిక షూటింగ్ లొకేషన్ కు తాగేసి వచ్చిందని, అక్కడ షూటింగ్ లో కూడా రచ్చ రచ్చ చేసింది .. పైగా దానికి సంబందించిన ఫోటోలు కూడా లీక్ అయి సంచలనం రేపాయి. దాంతో హన్సిక ఇలాంటిదా అనే టాక్ కూడా స్ప్రెడ్ అయింది. ముఖ్యంగా ఈ విషయం పై కోలీవుడ్ లో తీవ్ర విమర్శలు తలెత్తాయి. ఈ విషయం గురించి హన్సిక మాట్లాడుతూ ..సినిమాకు అవసరం కాబట్టే ఆ సీన్ ను అలా చేసానని, ఇంతకుముందు సినిమాల్లో మద్యం తాగే సన్నివేహాల్లో అడిగినా కాదని చెప్పానని, కానీ భోగన్ కథలో ఆ సీన్ డిమాండ్ ఉంది కాబట్టే అలా చేసానని చెప్పింది. పైగా ఆ సీన్ కూడా బాగా వచ్చిందని, నిజానికి నాకు అలాంటి అలవాట్లు లేవంటూ చెప్పింది.