బాలీవుడ్ నటికీ వార్నింగ్ ఇచ్చిన హన్సిక

Friday, October 27th, 2017, 03:23:08 PM IST

దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన భామ హన్సిక. అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లో అంతగా ఆకట్టుకోకపోయినా కోలీవుడ్ లో మాత్రం అవకాశాలను బాగానే దక్కించుకుంటోంది. చివరగా టాలీవుడ్ లో గోపీచంద్ – గౌతమ్ నంద సినిమాలో అలా కానీపించి అలా వెళ్ళిపోయింది. అయితే హన్సిక రీసెంట్ గా ఒక బాలీవుడ్ నటి సౌత్ ఇండస్ట్రీ హీరోయిన్స్ పై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో హన్సిక తనదైన శైలిలో స్పందించింది.

బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉన్న బుల్లితెర నటి హీనాఖాన్ ఇటీవల షోలో సౌత్ హీరోయిన్స్ ప్రేక్షకులను ఆకర్షించడానికి ఎక్స్ పోజింగ్ చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలకు నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హన్సిక కూడా తన స్టైల్ హిందీ నటికీ గట్టిగా కౌంటర్ వేసింది. ఒకప్పుడు సౌత్ లో నటించిన హీరోయిన్స్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ గా ఉన్నారని మర్చిపోకు అంటూ.. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. అంతే కాకుండా ఆమె చెప్పిన మాటలు పనికిమాలినవని చెబుతూ.. సిగ్గుపడాలని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది.