హనుమాన్ జంక్షన్ ఎస్సై మామూలు రసికుడు కాదండోయ్..!

Friday, September 29th, 2017, 12:26:48 PM IST


కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ 2 ఎస్సై గా భాద్యతాయుతమైన స్థానంలో ఉన్నా విజయ్ కుమార్ అనే వ్యక్తి రాసలీలల పర్వం ఇప్పుడు ఏపీలోనే హాట్ టాపిక్. బ్యూటీషియన్ అయిన ఓ వివాహితతో అతడు జరిగిపిన అక్రమ సంభందం, ఆమె భర్తని బెదిరించిన విధానం వర్ణనాతీతం. నూజివీడుకు చెందిన సాయితేజ అనే వ్యక్తికి బ్యూటీషియన్ తో వివాహం జరిగింది. ఆ ప్రాంతానికి ఎస్సైగా విజయ్ కుమార్ పనిచేసిన సమయంలో వీరి మధ్య అక్రమ సంభందం ఏర్పడింది.

వీరి వ్యవహారం సాయి తేజ్ కు తెలియడంతో భార్య నుంచి విడాకులు పొందాలని డిసైడ్ అయ్యాడు. కానీ పెద్దలు నచ్చజెప్పడంతో భార్యతో కలసి ఉండడడానికి అంగీకరించాడు. అయినా కూడా ఆమె తీరు మారకపోవడంతో సాయితేజ విసుగు చెందాడు. భార్యని మందలించడంతో ఎస్సై విజయ్ కుమార్ రంగం లోకి దిగి సాయి తేజ్ ని వేధించడం మొదలు పెట్టాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే తనపై వేధింపులు తప్పవని భావించిన సాయితేజ.. భార్య ఎస్సై తో కలసి ఉన్న దృశ్యాల్ని సేకరించి వీడియో చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భార్యతో కలసి తనని ఎస్సై చంపే ప్రయత్నం కూడా చేస్తున్నాడని వాపోయాడు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఎస్సై ని విధులనుంచి తప్పించి విచారణకు తరలించారు.

  •  
  •  
  •  
  •  

Comments