ద‌ర్శ‌కేంద్రుని వైభ‌వం తిరిగొస్తుందా?

Wednesday, May 23rd, 2018, 10:51:05 AM IST

హ్యాపీ బ‌ర్త్ డే రాఘ‌వేంద్ర‌రావుజీ

శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్ర‌రావు కెరీర్ 50 వ‌సంతాల‌కు చేరువ‌వుతోంది. 1973లో బాబు సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారిన ఆయ‌న‌ ఇప్ప‌టికే 43 ఏళ్లలో దాదాపు 107 చిత్రాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇన్ని సినిమాల్లో ఎన్నో సంచ‌ల‌న విజ‌యాలు ఉన్నాయి. ఇండ‌స్ట్రీ రికార్డులు ఉన్నాయి. కెరీర్‌లో ఎన్నో నందులు అందుకున్నారు. లెక్క‌కు మిక్కిలి ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారాలు అందుకున్నారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమా రారాజుగా రాఘ‌వేంద్రుని తెలుగు ప్రేక్ష‌కులు ఎంత‌గానో అభిమానించి ప్రేమించారు. ద‌ర్శ‌కేంద్రుడిలోని భ‌క్తిత‌త్ప‌ర‌త‌, విల‌క్ష‌ణ‌త గురించి ప్ర‌త్యేకంగా గుర్తు చేయాల్సిన ప‌నేలేదు.

ద‌ర్శ‌కేంద్రుడు తెర‌కెక్కించిన అన్న‌మ‌య్య‌, శ్రీ‌రామ‌దాసు, శిరిడీసాయి, ఓం న‌మో వెంక‌టేశాయ చిత్రాలు ఆయ‌న‌లోని మ‌హాభ‌క్తుని చాటాయి. క‌థానాయిక‌ల ఎద అందాల‌పై, బొడ్డుపై పూలు-పండ్లు ప‌ర‌చ‌డ‌మే కాదు, భ‌క్తిలో లీన‌మై అనంత దివ్య లోకాల్ని ద‌ర్శించ‌డ‌మెలానో ఆయ‌నే తెర‌పై చూపించ‌గ‌లిగారంటే అతిశ‌యోక్తి కాదు. అందుకే ఇప్పుడు ప్ర‌తిష్ఠాత్మ‌క తి.తి.దే భ‌క్తి చానెల్ ఛైర్మ‌న్‌గా కొనసాగుతున్నారు. తేదేపాతో అనుబంధం దృష్ట్యా ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే ఆస్కారాన్ని కొట్టి పారేయ‌లేం. అదంతా అటుంచితే కె.రాఘ‌వేంద్ర‌రావు విక్ట‌రీ వెంక‌టేష్‌తో ఓ భ‌క్తి సినిమాని తెర‌కెక్కించే ఆలోచ‌న‌లో ఉన్నార‌న్న ప్ర‌చారం ఇటీవ‌ల సాగింది. ఇందులో సునీల్ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తార‌ని తెలిసింది. అయితే రాఘ‌వేంద్రుని పున‌ర్‌వైభ‌వం చాటుకునేది ఈ సినిమాతోనేనా? లేక ఆయ‌న ఇంకేదైనా ప్రాజెక్టుపై దృష్టి సారించారా? అన్న‌ది తెలియాల్సి ఉందింకా. ఇక ఏపీలో సినీప‌రిశ్ర‌మ ఏర్పాటున‌కు సంబంధించి చంద్ర‌బాబుతో కీల‌క స‌మావేశాల్లోనూ రాఘ‌వేంద్రుడు ముందున్నార‌ని తెలుస్తోంది. నేడు ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ స్పెష‌ల్‌…

  •  
  •  
  •  
  •  

Comments