హ్యాపీ బి-డే : అభ‌య తార‌క మంత్రం

Sunday, July 22nd, 2018, 02:06:15 PM IST

నంద‌మూరి హీరోలు ఆ న‌లుగురే అని ఎవ‌ర‌న్నారు? ఐదోవాడొస్తున్నాడు. వాడు సివంగిలాంటోడు. తాతముత్తాత‌ల‌కు ధీటైన చిచ్చ‌ర పిడుగు లాంటోడు. తండ్రికి త‌గ్గ న‌ట‌వార‌సుడు అనిపించుకునే చుర‌క‌త్తి లాంటి కుర్రోడు. ఇంత‌కీ ఎవ‌ర‌బ్బా? అంటారా.. ఇంకెవ‌రు మాష్ట‌ర్ అభ‌య్‌రామ్‌.

ఇన్నాళ్లు నంద‌మూరి హీరోలంటే బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్‌రామ్, మునుముందు రంగంలోకి దిగుతున్న మోక్ష‌జ్ఞ మాత్ర‌మే అనుకుంటే పొర‌పాటే. మ‌రో ప‌దేళ్ల‌లోనే ఇంకొక చుర‌క‌త్తి లాంటి వార‌సుడు బ‌రిలో దిగిపోవ‌డం ఖాయం. ప్ర‌స్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్‌ని 100 కోట్ల రేంజులో ఊపు ఊపేస్తున్న యంగ్ య‌మ ఎన్టీఆర్ సిస‌లైన వార‌సుడు బ‌రిలో దిగిపోవ‌డం ఖాయమ‌న్న ఆలోచ‌న‌లు అభిమానుల్లో ఉన్నాయి. ప్ర‌స్తుతం అభ‌య్‌రామ్ నిండా ఐదేళ్ల‌యినా లేని బాల‌కుడు కావొచ్చు. కానీ అత‌డు వేగంగా ఎదిగేస్తున్నాడు. ఇదిగో ఈ ఫోటో చూస్తే మీకే అర్థ‌మైపోతుంది. నేడు ఎన్టీఆర్ వార‌సుడు అభ‌య్‌రామ్‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానులు శుభాకాంక్ష‌ల‌తో మోతెక్కించారు వెబ్‌లో.

  •  
  •  
  •  
  •  

Comments