మోడీ పై పరోక్షంగా కౌంటర్ వేసిన హార్దిక్

Tuesday, January 23rd, 2018, 03:20:20 AM IST

ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలపై కొందరు నేతలు కౌంటర్లు వేస్తున్న తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే మోడీ చేసిన కామెంట్స్ ఏ తరహాలో అన్నాడో గాని ప్రతి పక్షాలు మాత్రం నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నాయి. ఆయన కావాలనే సెటైర్ వేశారని విమర్శలు చేస్తున్నారు. రీసెంట్ గా పటేళ్ల ఉద్యమ సారధి హార్థిక్‌ పటేల్‌ చేసిన ఘాటు వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. మోడీని పరోక్షంగా విమర్శించారు. ఒక చాయ్ లు అమ్ముకునే వ్యక్తి అనే సోషల్ మీడియాలో కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. రీసెంట్ గా ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఒక వ్యక్తి పకోడడిలు అమ్ముకొని రూ.200 పట్టుకొని సాయంత్రం ఇంటికొస్తే దాన్ని ఉపాధిగా పరిగణిస్తారా? లేదా? అని స్పందించగా.. హార్దిక్ పటేల్ పరోక్షంగా కౌంటర్ వేశారు. టీలు అమ్ముకునే వ్యక్తి నిరుద్యోగులను స్నాక్స్ అమ్ముకోవాలని సలహా ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.