నిజాలు మాట్లాడుతాననే నన్ను పక్కన పెట్టారంటున్న హరికృష్ణ…!

Sunday, January 29th, 2017, 02:00:07 AM IST

harikrishna1
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడూ మనసులో ఏం అనుకుంటారో అదే బయటకు చెప్పేస్తారు. ఎవరో ఏదో అనుకుంటారు అనుకునే రకం కాదు హరికృష్ణ. ఇంతకూ ముందు కూడా ఆయన చాలాసార్లు కొన్ని కఠినమైన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం నరసింహపురంలో సీసీ రోడ్డును ప్రారంభించిన ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నిజాలు మాట్లాడతాను కాబట్టే తనను వెనక్కు నెట్టారని, నిజాలు మాట్లాడతాను కాబట్టే తనకు జీవితంలో ఇప్పటివరకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయని, హరికృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నిజాలు మాత్రమే మాట్లాడతానని, వెనక్కి తగ్గేది లేదని హరికృష్ణ స్పష్టం చేశారు. తెలుగువాడికి ఒక గొప్ప గౌరవం తీసుకొచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారిదేనని ఆయన కొనియాడారు. హరికృష్ణ రాజ్యసభ సభ్యునిగా ఉన్నపుడు సీసీ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. దీంతో ఈ రోడ్డు ఆయనే ప్రారంభించాలని గ్రామస్తులు కోరారు. గ్రామస్తుల కోరిక మేరకు అక్కడకు వెళ్లిన హరికృష్ణకు ఘనస్వాగతం పలికారు గ్రామస్తులు. అనంతరం ఆయన ఎద్దుల బండిపై ఊరేగారు.