ఇది పైత్యం కాక ఇంకేంటి హ‌రీష్‌?

Friday, September 23rd, 2016, 12:34:39 AM IST

Harish-rao
సుప్రీం కోర్టు ఆదేశాలు మేర‌కు నిన్న ఏపీ సీఏం చంద్ర‌బాబునాయుడు- టీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీలో అపెక్స్ కౌన్సిలో తో భేటి అయిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశానికి నీటి పారుదల శాఖ మంత్రి హ‌రీష్ రావు కూడా హ‌జ‌ర‌య్యాడు. అయితే ఇరు ముఖ్య‌మంత్రులు మాట్లాడుతుండ‌గా హ‌రీష్ అత్యుత్సాహంగా బాబుకు అడ్డు త‌గిలి పెద్ద ర‌చ్చ చేశాడు. రెండు రాష్ట్రాలు స్నేహ పూర్వ‌కంగా ముందుకు పోవాల‌ని బాబు అంటే..హ‌రీష్ మాత్రం మా ప్రాజెక్టుల‌కు అడ్డు త‌గులుతున్నారు ఇదేనా స్నేహ‌పూర్వ‌కంగా పోవ‌డం అంటే? అని ప్ర‌శ్నించాడు.

భేటీ సీరియ‌స్ గా జ‌రుగుతోన్న స‌మ‌యంలో హ‌రీష్ రావును కంట్రోల్ చేద్దామ‌ని కేసీఆర్ ఎంత ప్ర‌య‌త్నించినా మామ‌ను సైతం ప‌ట్టించుకోకుండా వాధించాడు. హ‌రీష్ దూకుడు చూసి అపెక్స్‌ కమిటీకే షాక్ తిన్నంత ప‌నైంది. అయితే హ‌రీష్ వైఖ‌రిపై ఏపీ మంత్రులంతా సీరియ‌స్ అవుతున్నారు. హ‌రీష్ రావుకు మాట్లాడం చేత‌కాక ఇలా భేటి మ‌ధ్య‌లో అడ్డు త‌గులున్నాడ‌ని, ఇది పైత్యం కాక ఇంకేటని ఏపీ మంత్రులంతా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.