కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ అయిన రాష్ట్ర ఆర్థిక మంత్రి…

Friday, September 20th, 2019, 08:17:40 PM IST

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు నేడు గోవా లో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ తో భేటీ అయ్యారు. కాగా శుక్రవారం నాడు గోవా లో జరిగినటువంటి జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరైనటువంటి తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు, ఆ సమావేశానికి హాజరైనటువంటి కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులను అన్నింటిని కూడా హరీష్ రావు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కి వివరంగా వివరించారని సమాచారం. అంతేకాకుండా వారు పడుతున్నటువంటి సమస్యలను అన్నింటిని కూడా హరీష్ రావు వివరంగా చెప్పారని తెలుస్తుంది.

కాగా కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమను జీఎస్టీ పరిధిలోకి తెచ్చి, వారిపై అనవసరమైన పన్నులు విధించడం అనేది, ఆ బీడీ కార్మికుల వ్యాపారం పై తీవ్రమైన భారాన్ని చూపిస్తుందని, అందువలన వారు వ్యాపారంలో ఎదగలేకపోతున్నారని తెలిపారు. ఇకాగే కొనసాగితే అనవసరంగా వారి పరిశ్రమ దెబ్బతింటుందని హరీష్ రావు వివరించారు. ఇకపోతే బీడీ కార్మికులకు ఆ ఉపాధి వల్లే అనవసరమైన రోగాల బారిన పడుతున్నారని, వారి శ్రమను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా నెలకు రూ.2016 చొప్పున ఆసరా పెన్షన్ రూపంలో ఆర్థిక సాయం చేస్తుందని హరీష్ రావు వివరించారు. ఇకపోతే బీడీ కార్మికుల కోసం ప్రత్యేకమైన ఆర్థిక పరమైన కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర ఆర్థిక శమంత్రినిర్మల సీతారామన్ కి తెలంగాణ అర్తక శాఖ మంత్రి హరీష్ రావు వివరించారు.