తప్పుడు వార్తలపై హరీష్ రావు సంచలన ట్వీట్.!

Wednesday, July 10th, 2019, 01:11:29 PM IST

తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తెరాస మాజీ మంత్రి హరీష్ రావుకు ఉన్న క్రేజ్ కోసం మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.అయితే హరీష్ రావు గారు తాజాగా ఒక సంచలన ట్వీట్ పెట్టారు.మాములుగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా ప్రచురించే వార్తా పత్రికలు కోకొల్లలుగా ఉన్న ఈ సమాజంలో హరీష్ రావు మీద ఓ అసత్య వార్త దృష్టిలోకి వచ్చింది.ఇంతకీ ఈ వార్త ఏమిటంటే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహా మాజీ మంత్రి హరీష్ రావు కూడా రాగా ఇంద్ర కరణ్ రెడ్డి హరీష్ కాళ్ళు మొక్కేందుకు ప్రయత్నించగా అక్కడ ప్రజలంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారని దీనితో హరీష్ ఆయన్ని ఆపారని ఒక వార్త ప్రచురించారు.

ఈ వార్త చూసిన హరీష్ రావు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తన స్పందనను ఇలా తెలియజేసారు.”ఈ వార్తపూర్తిగాఅవాస్తవం. గౌ.మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిగారు నేలమీది నుండి లేచినిలబడేందుకు ప్రయత్నిసుండగా సాయపడ్డాను. దీన్నితప్పుగా అర్థంచేసుకుని ప్రచురించారు. ఈవార్తను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇదిబాధాకరం. భవిష్యత్ లో వార్తలు ప్రచురించేముందు నిర్ధారణచేసుకుని ప్రచురించాలని కోరుతున్నా” అని ఆ వార్త ప్రచురించిన వారికి గడ్డి పెట్టినంత పని చేసారు.