హరీష్ రావు కొత్త ప్రయోగం – ఎంతవరకు ఆకట్టుకుంటుంది…?

Thursday, August 22nd, 2019, 12:37:07 AM IST

తెరాస పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి కూడా పార్టీ కి వెన్నెముకలా ఉంది, పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు చాలా ప్రయత్నాలు చేసినటువంటి తెరాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు సరికొత్త ప్రయోగానికి నాంది పలికారు. ఇకపోతే తెలంగాణాలో తెరాస పార్టీ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించినటువంటి హరీష్ రావు, తాను తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో విజయవంతమైన పథకాలను అమలు చేశారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చినటువంటి తెరాస పార్టీ ఈ సారి మాత్రం హరీష్ రావు కి మంత్రి పదవి ఇవ్వలేదనే చెప్పాలి. ఐయినప్పటికీ కూడా ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటూ తన సిద్ధిపేట నియోజకవర్గాన్ని చాలా వరకు డెవలప్ చేశారు హరీష్ రావు. కాకపోతే తెలంగాణాలో ఈసారి జరిగే కేబినెట్ సవరణలో హరీష్ రావు కి మళ్ళీ మంత్రి పదవి వస్తుందని ఇప్పటికే చాలా రకాలైన వార్తలు వచ్చాయి… కానీ దాంట్లో ఎంత వరకు నిజం ఉండే తెలియడం లేదు.

అయితే, కొత్తగా హరీష్ రావు సరికొత్తగా పర్యావరణం ద్రుష్టి పెట్టారు… అదేంటంటే… మరికొద్ది రోజుల్లో దేశమంతటా కూడా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి… ఈమేరకు ప్రజలందరూ కూడా ప్రతి గల్లీలో వినాయక విగ్రహాలు పెడతారు. అయితే ఇలాంటి విగ్రహాలు పెట్టడం వలన పర్యావరణానికి హాని కలుగుతుందని హరీష్ రావు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు… ఈ వినాయక చవితికి వాడవాడలా కాకుండా కేవలం పట్టణంలో ఒకే స్థానంలో అన్ని విగ్రహాలు ఏర్పాటు చేయాలని, అది కూడా కేవలం మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయాలనీ హరీష్ రావు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇలా చేయడం వలన పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లదని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని హరీష్ రావు తెలిపారు. కానీ హరీష్ రావు నిర్ణయాన్ని సిద్దెపేట ప్రజలు ఎంత వరకు ఆహ్వానిస్తారో చూడాలి…