వాళ్లిద్దరూ ఎవరో దొరికేస్తే నితిన్,శర్వా లకు లైన్ క్లియర్..!

Tuesday, January 30th, 2018, 06:04:01 PM IST

దర్శకుడు హరీష్ శంకర్ మాస్ ఎలిమెంట్స్ తో యూత్ ని మెప్పించడంలో దిట్ట. నితిన్ మరియు శర్వానంద్ లతో ఈ దర్శకుడు మల్టి స్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘దాగుడు మూతలు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించనున్నారట.

దిల్ రాజు నిర్మాణంలో రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రి ప్రొడెక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. నితిన్, శర్వా సరసన నటించే హీరోయిన్ల విషయంలో హరీష్ ఓ నిర్ణయానికి రాలేకున్నాడట. హీరోయిన్ల ఎంపిక పూర్తయితే ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. హరీష్ శంకర్ ఇప్పటికే ఈ చిత్ర కథని రెడీ చేసినట్లు తెలుస్తోంది.