బన్నీ దర్శకుడు మళ్ళీ దిల్ రాజు గూటికే ?

Saturday, October 6th, 2018, 02:43:17 PM IST

సినిమా పరిశ్రమలో సక్సెస్ మాత్రేమే కీలకం. ఇక్కడ సక్సెస్ లేకుంటే .. ఎవరు పట్టించుకోరు .. అంతకు ముందు హిట్ వసిసినప్పుడు పొగిడిన వాళ్ళే ఫ్లాప్ రాగానే .. ముఖం చాటేస్తారు. ఇక్కడ ఇది బహిరంగ రహస్యమే. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. అల్లు అర్జున్ హీరోగా దువ్వాడ జగన్నాధం సినిమా చేసిన దర్శకుడు హరీష్ శంకర్ కి ఆ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని ఇవ్వలేకపోయింది. భారీ అంచలన మధ్య విడుదలైన ఈ సినిమా తరువాత దర్శకుడు హరీష్ శంకర్ పరిస్థితి కూడా రివర్స్ అయింది. ఆ సినిమా తరువాత ఎన్ని ప్రయత్నాలు చేసిన కూడా వర్కవుట్ కావడం లేదు. ఆ మద్యే ఈ ఒక సినిమాకు ప్రయత్నాలు జరిగాయి కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. దాంతో ఈ దర్శకుడు అటు తిరిగి .. ఇటు తిగిరి మళ్ళీ దిల్ రాజు తో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ మద్యే దిల్ రాజు తమిళంలో త్రిష కీ రోల్ లో నటించిన 96 హక్కులను తీసుకున్నాడు .. ఈ సినిమా రీమేక్ కోసం హరీష్ ని తీసుకుంటాడో లేదో చూడాలి.