ఎన్టీఆర్ ను ఎంఎల్ఏ చేయాలనుకున్న దర్శకుడు ?

Sunday, January 28th, 2018, 12:47:47 PM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ఎం ఎల్ ఏ చేయాలనీ అనుకున్నానని ఓ దర్శకుడు చెప్పాడు ? ఎం ఎల్ ఏ పేరుతొ ఓ కథను రెడీ చేసి ఎన్టీఆర్ తో చేయాలనీ అనుకున్నానని కానీ అప్పుడు అది కుదరలేదని చెబుతున్న దర్శకుడు ఎవరో కాదు హరీష్ శంకర్ ? ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా చిత్రాన్ని రూపొందించిన హరీష్ శంకర్ తాజాగా ఓ ఆడియో వేడుకలో మాట్లాడుతూ .. కెరీర్ మొదట్లో ఎం ఎల్ ఎల్ టైటిల్ లో ఓ సినిమా చేయాలనీ ప్లాన్ చేసానని, ఆ కథను ఎన్టీఆర్ కు కూడా చెప్పానని .. ఆ తరువాత నాకు దర్శకుడిగా మిరపకాయ్ సినిమా అవకాశం రావడంతో ఎం ఎల్ ఏ మరచిపోయామని ఆ తరువాత ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా తీశానని చెప్పాడు హరీష్. ప్రస్తుతం ఎం ఎల్ ఏ టైటిల్ తో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు.