నాని – బన్నీ ఇద్దరు కాదు..మాస్ రాజా ఫిక్స్!

Saturday, February 24th, 2018, 01:34:29 PM IST

టాలీవుడ్ లో గత కొంత కాలంగా డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమాపై అనేక రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన చేయబోతోన్న రెండు సినిమాలు గురించి ఈ మధ్య ఊహాగానాలు ఎక్కువయ్యాయి. డీజే సినిమా తరువాత హరీష్ శంకర్ దాగుడుమూతలు అనే స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నాడు. శర్వానంద్ – నితిన్ నటించబోయే ఈ మల్టి స్టారర్ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇకపోతే నెక్స్ట్ సీటిమర్ అనే కథను కూడా హరీష్ సెట్ చేసుకున్నాడు.

గత కొన్ని రోజులుగా ఈ సినిమా లో తారాగణంపై అనేక రూమర్స్ వస్తున్నాయి. మొదట బన్నీతో ప్లాన్ చెయ్యాలని అనుకున్నట్లు టాక్ బాగానే వచ్చింది. నానికి కూడా స్క్రిప్ట్ చెప్పడం జరిగిందని సినిమా కూడా త్వరలో పట్టలేకబోతోందని కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ ఎంత వరకు నిజమో గాని రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ లో రవితేజ ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. హరీష్ శంకర్ ఇంతకుముందు రవితేజ తో మిరపకాయ్ అనే సినిమాను చేశాడు. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ సీటీమార్ అనే సినిమా కూడా మాస్ రాజాతో చేయడానికి హరీష్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.