హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు – కెసిఆర్ కోసమేనా…?

Friday, July 5th, 2019, 01:42:41 AM IST

తెలంగాణాలో తెరాస పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చాక తెరాస పార్టీ అధినేత కెసిఆర్, ఇన్నిరోజులు పార్టీలో కీలకంగా ఉన్న తెరాస నేత హరీష్ రావు ని పక్కనబెట్టిన సంగతి మనకు తెలిసిందే. గత కొంత కాలంగా ఈ వార్తలు కూడా రాష్ట్రమంతటా వైరల్ గా మారాయి… అయితే ఇటీవలే మీడియా ముందుకు వచ్చిన హరీష్ రావు మాట్లాడుతూ… తెరాస పార్టీలో తనని పక్కనబెట్టారన్న వార్తలు అవాస్తవమని, తనకు ఎలాంటి పదవుల మీద ఆశ లేదని హరీష్ రావు తేల్చి చెప్పేశారు. హరీష్ రావు అలా చెప్పినప్పటికీ కూడా హరీష్ రావు అభిమానులు మాత్రం ఇప్పటికి కూడా నిరాశలోనే ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మధ్యన హరీష్ రావు బీజేపీలోకి వెళ్తున్నలు వార్తలు రావడంతో, తెరాస అధినేత కెసిఆర్ హరీష్ రావు కి తన మంత్రి వర్గంలో చోటు కల్పిస్తున్నట్లు, విద్యాశాఖ మంత్రి గ బాధ్యతలను అప్పగించనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ వార్తలు ఎంత వరకు నిజమో తెలియడం లేదు.

అయితే… తాజాగా సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడ్ గ్రామంలో రెడ్డి సంక్షేమ భవనం, రజక, గౌడ సంఘ భవనాలు, లైబ్రరీ, ఎస్సీ మాదిక కమ్యునిటీ హాల్ ను ప్రారంభించేశారు హరీశ్. అంతేకాకుండా ఎస్పీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు కొన్ని సంచలన వాఖ్యలు చేశారు. కానీ ఈ మాటలు విన్నవారందరు కూడా హరీష్ రావు కావాలనే కెసిఆర్ ని టార్గెట్ గా చేసి ఈ వ్యాఖ్యలు చేశారని అందరు అంటున్నారు. ఇంతకీ హరీష్ రావు ఏమన్నారంటే… “ఓట్లప్పుడు మాత్రమే వచ్చేటోడు నాయకుడు కాదు.. ఐదేళ్లు ప్రజల మధ్య ఉండి పని చేసేటోడే అసలైన నాయకుడనేశారు”. కాగా ఇప్పటికే హరీష్ రావు చేసిన వాఖ్యలపై విమర్శకులు కూడా పలు వాఖ్యలు చేస్తున్నారు.