పంట పొలాల్లో ప్రముఖ సింగర్ దారుణ హత్య..!

Thursday, January 18th, 2018, 11:25:01 PM IST

ప్రముఖ సింగర్ మమత శర్మ దారుణ హత్యకు గురయ్యారు. హర్యానాలో స్వయానా ముఖ్యమంత్రి ఖట్టర్ పూర్వీకుల గ్రామంలోని పంట పొలాల్లో ఆమె విగత జీవిగా కనిపించారు. మమతా శర్మది హత్యే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మమత శర్మ మెడని కోసిన గాయాలు కూడా కనిపిస్తున్నాయి. మమత శర్మ జానపద గీతాలు, భజన పాటలు పాడి మంచి గుర్తింపు పొందారు.

మమత సల్మాన్ ఖాన్ చిత్రం దబాంగ్ లో సూపర్ హిట్ సాంగ్ మున్ని బద్నామ్ ని పాడారు. కాగా జనవరి 14 న గొహానా లో కార్యక్రమం ఉందని ఇంటి నుంచి వెళ్లిన మమతా తిరిగి రాలేదు. ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ లకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఇంతలోనే మమతా శర్మ రోహతక్ జిల్లాలోని బాలియా గ్రామంలో శవమై కనిపించడంతో ఆమె కుటుంబం లో విషాదం నెలకొంది. ఆగ్రామం హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ పూర్వీకులు నివాసం ఉండిన గ్రామం. హర్యానా లో గత ఐదు రోజులుగా ఎదో ఒక దారుణం జరుగుతూనే ఉండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి.