ట్రైలర్ : హేట్ స్టోరీ 4 కాంట్రవర్సీ..హద్దులు దాటేసిన ఊర్వశి..!

Sunday, January 28th, 2018, 01:24:21 PM IST

ఊర్వశి రౌటేలా..సినీ అభిమానులకుపరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్ లో ఊర్వశి ఇప్పుడు సరికొత్త శృంగార దేవతగా అవతరించింది. ఇటీవల విడుదలైన హేట్ స్టోరీ 4 ట్రైలర్ నెట్ లో వైరల్ గా మారింది. హేట్ స్టోరీ సిరీస్ లో వచ్చిన 1, 2, 3 అన్ని పెద్ద హిట్ అయ్యాయి. తనేం తక్కువ తినలేదు అంటూ ఊర్వశి రౌటేలా చెలరేగిపోయింది. తన టాలెంట్ మొత్తం ప్రదర్శించిన శృంగార సన్నివేశాల్లో చెలరేగిపోయింది. ఈ చిత్రంలో ఊర్వశి గ్లామర్ ఒలకబోస్తుందని అందరికి తెలుసు. కానీ మరీ శృతి మించి అందాల ఆరబోత చేయడంతో బాలీవుడ్ వర్గాలు సైతం ఆశ్చర్య పోయాయి.

లేటెస్ట్ గా విడుదలైన హేట్ స్టోరీ 4 ట్రైలర్ కాంట్రవర్సీ అయి కూర్చుంది. ఇలాంటి సినిమా తీసే బదులు నేరుగా అశ్లీల చిత్రం తీసుకోవచ్చుగా అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. బూతు కంటెంట్ ఎక్కువగా పెట్టడం అధిక వసూళ్లు దండుకోవచ్చనే అభిప్రాయంతోనే నిర్మాతలు ఇలాంటి చిత్రాలని ప్రోత్సహిస్తున్నారని మండి పడుతున్నారు. గ్లామర్ ప్రియులని ఆకట్టుకుంటూ, మరికొందరిచే విమర్శలు ఎదుర్కొంటున్న హేట్ స్టోరీ సిరీస్ నుంచి ఇంకెన్ని చిత్రాలు రానున్నాయో. మార్చి 2 న విడుదల కానున్న ఈ చిత్రానికి విశాల్ పాండ్య దర్శకుడు.