ట్రంప్ వ్యతిరేకులపై పెప్పర్ స్ప్రే ప్రయోగించిన అమెరికా పోలీసులు

Friday, January 20th, 2017, 03:14:57 PM IST

us
‘పెప్పర్ స్ప్రే’ ఈ పేరు వినగానే మనకు ఆంధ్రప్రదేశ్ మాజీ కాంగ్రెస్ నాయకుడు లగడపాటి రాజగోపాల్ గుర్తొస్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే ఉపయోగించడం అప్పట్లో సంచలనం కలిగించింది. ఆ సంఘటన జరిగిన నాటి నుండి దేశంలో చాలామంది అమ్మాయిలు తమకు రక్షణగా పెప్పర్ స్ప్రే లను వినియోగిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అమెరికాలో ఆందోళనకారులపై పోలీసులు పెప్పర్ స్ప్రే ఉపయోగించి వార్తల్లో నిలిచారు.

మరికొన్ని గంటల్లో అమెరికా కొత్త అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయబోయే ట్రంప్ కు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అంగరంగ వైభవంగా తన ప్రమాణ స్వీకారం ఉండాలని భావిస్తున్న ట్రంప్ కు నిరసన కారుల సెగ తగిలింది. వాషింగ్టన్ డీసీ దగ్గర ప్రమాణ స్వీకారం చేసే నిరసన కారులు పెద్ద సంఖ్యలో ఆందోళన చేపట్టారు. మహిళలను గౌరవించని వ్యక్తి అమెరికా అధ్యక్షుడు ఎలా అవుతారు అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉన్న పోలీసులు లాఠీ ఛార్జ్ చేయకుండా ఆందోళనకారులపై పెప్పర్ స్ప్రే ఉపయోగించారు. దీంతో కళ్ళు మండిపోయి, నోట మాట రాక ఆందోళనకారులు అక్కడినుండి పరుగులు తీశారు. కొందరైతే ఆ ఘాటు తట్టుకోలేక స్పృహ కోల్పోయారు. వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి వైద్యం చేస్తున్నారు.