హీట్ పెంచుతున్న `హేట్ స్టోరి 4`

Saturday, January 27th, 2018, 12:41:51 PM IST

ద్రౌప‌దికి ఐదుగురు భ‌ర్త‌లున్నారు.. నాకు ఇద్ద‌రే క‌దా! అంటోంది హేట్ స్టోరి బ్యూటీ ఊర్వ‌శి రౌతేలా. ఈ ఒక్క డైలాగ్‌తోనే హీట్ పెంచేసింది రౌతేలా. హేట్ స్టోరి సిరీస్‌లో వ‌స్తున్న ఈ నాలుగో సినిమా ష్యూర్‌షాట్ హిట్ కొడుతుంద‌ని తాజాగా రిలీజైన ట్రైల‌ర్ చెబుతోంది. వేడెక్కించ‌డ‌మే ధ్యేయంగా .. ఇల్లీగ‌ల్ ఎఫైర్స్ బేస్డ్ స్టోరితో తెర‌కెక్కిన ఈ సినిమా యువ‌త‌రానికి స్వీట్ డ్రీమ్స్ అందించ‌నుంద‌ని ట్రైల‌ర్ చెబుతోంది. విశాల్ పాండ్య ద‌ర్శ‌క‌త్వంలో టిసిరీస్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ కానుంది.

సినిమా ఆద్యంతం ఊర్వ‌శి రౌతేలా, ఇహానా త‌దిత‌రుల‌ అంద‌చందాలు వేడి పెంచేయ‌డం ఖాయం అని అర్థ‌మ‌వుతోంది. ట్రైల‌ర్ నెట్‌లో దూసుకుపోతోంది. రిలీజైన కొన్ని గంట‌ల్లోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్‌తో చెల‌రేగిపోతోంది. రివెంజ్‌, మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో హైపంచ్ రొమాంటిక్‌ థ్రిల్ల‌ర్ ఇద‌ని ట్రైల‌ర్ చెబుతోంది. క‌ల‌టు గ‌నే యువ‌త‌రాన్ని వెంటాడే ఆస‌క్తిక‌ర ట్రైల‌ర్ ఇదిగో..