వీడియో : మహానటిలో మోహన్ బాబు ఎంట్రీ చూశారా..?

Monday, May 7th, 2018, 09:52:35 AM IST

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి అందాల తార సావిత్రి జీవితం ఆధారంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. ఈ సినిమాలో కీర్తి సురేశ్ టైటిల్ పాత్ర పోషించారు. సమంత, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

ఆదివారం ఎస్వీ రంగారావు పాత్రకు సంబంధించిన క్యారెక్టర్‌ను చిత్రబృందం వెల్లడించింది. సినీ నటుడు నాని ఆ పాత్రను వీడియోలో పరిచయం చేశారు. ఇందులో మోహన్‌బాబు.. విలక్షణ నటుడు ఎస్వీ రంగారావు పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో ఎల్వీ ప్రసాద్‌గా అవసరాల శ్రీనివాస్, కేవీ రెడ్డిగా క్రిష్ కనిపిస్తున్న వీడియోలను శనివారం నాని విడుదల చేసిన విషయం తెలిసిందే.

Comments