బ‌రిలోకి హ‌జారే .. చంద్ర‌బాబు నెత్తిన పెద్ద బండ‌!

Tuesday, September 27th, 2016, 11:57:35 AM IST

anna-hazare
ఇప్ప‌టీకే ఏపీలో అధికార తేదేపా ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటోంది. అటు ప్ర‌తి ప‌క్షాల దాడికి త‌ట్టుకోలేక గిల‌గిలా కొట్టుకుంటోంది. తాజాగా ఇప్పుడు బాబు నెత్తిన పెద్ద స‌మ‌స్య వ‌చ్చి ప‌డేలా ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అదీ ఈసారి దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న అన్నాహ‌జారే ఉద్య‌మానికి బాబు సిద్దంగా ఉండాల‌ని హెచ్చ‌రిక‌లు అందుతున్నాయి. ఇప్ప‌టికే కొత్త రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం పై చాలా ఆరోప‌ణ‌లున్నాయి. ప్ర‌భుత్వం రైతుల నుంచి బ‌ల‌వంతంగా భూ సేక‌ర‌ణ చేయ‌డంతో…ప‌ర్యావ‌ర‌ణానికి తీవ్ర న‌ష్టం వాటిల్లుతోంద‌ని ఆరోప‌ణ‌లున్నాయి. దీంతో ఈ స‌మ‌స్య‌పై గ్రీన్ ట్రిబ్యూన‌ల్ పోరాటం చేస్తోంది. తాజాగా సుప్రీంకోర్టు న్యాయ‌వాది సంజ‌య పారిక్ ప్రోఫ‌స‌ర్ విక్రమ్‌సోనిల‌తో కూడిని నిపుణుల బృందం రెండు రోజుల పాటు 29 గ్రామాల‌ను ప‌ర్య‌టించి వివ‌రాలు సేక‌రించింది.

ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భుత్వం తెలిపిన వివ‌రాల‌న్నీ భూసేక‌ర‌ణ‌కు పూర్తిగ వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని తేలింది. ఏటా మూడు పంటలు పండే భూముల్ని ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవ‌డం వ‌ల్ల రైతుల‌కు స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చరిస్తున్నారు. త్వ‌ర‌లో ఈ అంశాల‌న్నింటినీ సుప్రీం కోర్టులో తెల‌ప‌నున్నారు. అలాగే మ‌లి ద‌శ‌లో అన్నా హ‌జారేను కూడా రంగంలోకి దింపాల‌ని చూస్తున్నట్లు స‌మాచారం. నిజంగా హ‌జారే అమ‌రావ‌తి వ‌చ్చి ధీక్ష‌చేస్తే పెద్ద విధ్వంస‌మే జ‌రుగుతుంది. ఒక సారి ఢిల్లీలో చేసిన ఉద్య‌మానికే కేంద్రం క‌దిలొచ్చింది. అలాంటిది టీడీపీకి వ్య‌తిరేకంగా ఉద్యమం చేస్తే ప్ర‌భుత్వానికి చిక్కులు త‌ప్ప‌వ‌నే అంటున్నారు.