ఆ 12 మంది ఎమ్మెల్యేలపై అన‌ర్హ‌త వేటు!

Thursday, September 22nd, 2016, 02:25:36 PM IST

ts-speaker
తెలంగాణ తేదేపాలో మిగిలింది ఒకే ఒక్క‌డు! టీటీడీఎల్పీ నేత‌ రేవంత్ మిన‌హా మిగ‌తా వాళ్లంతా కారెక్కేసి తేదేపాకి పెద్ద హ్యాండిచ్చారు. మిగులుతాడు.. అండ‌గా ఉంటాడు అనుకున్న ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు సైతం గులాబీ ముళ్ల కంపలో చిక్కుకున్నాడు. మొత్తం 12 మంది తేదేపా నేత‌లు తేరాస ఆక‌ర్ష్ వ‌ల్లో ప‌డిపోవ‌డంతో తెలంగాణ‌లో పార్టీ కోసం ఏం చేయాలో తెలీని ఆగ‌మ్య గోచ‌రం ఏర్ప‌డింది. పార్టీ ఫిరాయింపుల‌పై సుప్రీంలో పిటిష‌న్ వేసిన ఎర్ర‌బెల్లి సైతం ఆన‌క సైలెంటుగా పెట్టే బేడా స‌ర్ధుకుని తేరాస తీర్థం పుచ్చుకున్నారు..

అయితే వీళ్లంద‌రికీ అనూహ్యంగా దెబ్బ ప‌డుతోందిప్పుడు. ఇలా పార్టీ ఫిరాయించిన వారికి వ్య‌తిరేకంగా హైకోర్టు తీర్పు వెలువ‌రించింది. వీరంద‌రిపై అన‌ర్హ‌త వేటు వేయాల్సిందిగా తుది తీర్పు వెలువ‌రించింది కోర్టు. దీంతో స‌ద‌రు జంపింగ్ క్యాండెట్లంతా ల‌బోదిబో మంటున్నారు. దేవుడిని శ‌ర‌ణు వేడుతున్నారు. వేటు వేయాల్సిందిగా ఇప్ప‌టికే అసెంబ్లీ స్పీక‌ర్‌కు ఆదేశాలందాయి. కాబ‌ట్టి జంప్ జిలానీలంతా దేవుడిని మొక్కే ప‌నిలో ఉన్నారిప్పుడు. బుద్ధి త‌క్కువ ప‌నిచేసి బుక్క‌యిపోయామంటూ ఏడుపు మొహాలేస్తున్నారు.