సైరా టీమ్ నుంచి ఆయ‌న‌ ఔట్‌!

Monday, April 16th, 2018, 09:45:35 PM IST

శ్రీ‌రెడ్డి ర‌చ్చ .. ఇది మామూలు చిచ్చు కాదు! ఆవిడ తెచ్చిన తంటా అలాగ ఇలాగా లేదు. చిత్త‌డి చిత్త‌డి చేస్తోంది. విక్ర‌మార్కుడు భాష‌లో చెప్పాలంటే జింతాత జింతాత అన్న‌మాట‌! ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, హీరోలు, తోటి ఆర్టిస్టులు, వీళ్ల పుత్ర ర‌త్నాలు ఒక‌రేమిటి ఎంద‌రో విక్టిమ్స్ శ్రీ‌రెడ్డి దెబ్బ‌కు దాక్కుంటున్నారు. దెబ్బ‌కు ఠా అంటున్నారు.

లేటెస్టుగా మ‌రో `ఠా` గురించి తెలిసిందే. టాలీవుడ్‌లో ద‌శాబ్ధాలుగా ప్ర‌ముఖ ఎగ్జిక్యూటివ్ నిర్మాత హోదాలో సినిమాని శాసిస్తున్న ఆ పెద్దాయ‌న‌కు పెద్ద రేంజులోనే మ‌కిలి అంటింది. ఆయ‌న అమ్మాయిల్ని నానా ర‌కాలుగా తిప్ప‌లు పెడ‌తాడ‌ని డైరెక్టుగా టీవీ చానెళ్ల‌లోనే డిబేట్ పెట్ట‌డంతో .. స‌ద‌రు పెద్దాయ‌న్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ త‌మ కంపెనీ నుంచి తొల‌గించిందిట‌. ఇదంతా దిద్దుబాటు చ‌ర్య‌ల్లో భాగ‌మేన‌ని చెబుతున్నారు. క‌త్తిమ‌హేష్ అస‌లే కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌పై కేసు పెడుతున్నానని ప్ర‌క‌టించ‌డంతో అదంతా ఆయ‌న మెడ‌కు చుట్టుకుంది. ఆయ‌న‌కు, సద‌రు క‌త్తి మ‌హేష్‌కి జాయింట్ స్నేహితురాలైన ఆవిడ టీవీల‌కెక్క‌డంతో ఇంత ప‌ని జ‌రిగింది. అయితే ఇంత‌కీ ఆయ‌న పేరేమి? అంటే వాకాడ అప్పారావు. సూప‌ర్‌గుడ్ ఫిలింస్‌తో గొప్ప అనుబంధం సాగించిన ఆయ‌న ప్ర‌స్తుతం కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌లో కీల‌క ప‌ద‌విని ఆస్వాధిస్తున్నారు. తాజా గొడ‌వ‌తో ఆయ‌న ఔట్ అని చెబుతున్నారు. ఫోన్‌ల‌కు ఆయ‌న దొర‌క‌డం లేద‌ని మీడియాలో టాక్ న‌డుస్తోంది.