పీపుల్ స్టార్ కోసం 230 మంది పోలీస్ లకు సెలవు..!

Thursday, January 19th, 2017, 11:55:57 PM IST

r-narayana-murthy
ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ శ్రీనివాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి తాజా చిత్రం ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య ‘ కోసం జిల్లాలోని 230 మంది హెడ్ కానిస్టేబుల్ లకు గురువారం సెలవు ప్రకటించారు. కాగా ఈ చిత్రం సంక్రాంతి సందర్భగా విడుదలైన విషయం తెలిసిందే.

జిల్లాలోని గణేష్ థియోటర్ లో హెడ్ కానిస్టేబుల్స్ అందరు వారి కుటుంబసభ్యులతో కలసి ఉచితంగా ఈ చిత్రాన్ని చూసే ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యం లో జిల్లాలోని హెడ్ కానిస్టేబుల్ లందరికి సెలవు ప్రకటించినట్లు ఎస్పీ తెలిపారు. ఆర్ నారాయణ మూర్తి, జయసుధలు నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలయింది. ఈ చిత్రంలో ఆర్ నారాయణ మూర్తి హెడ్ కానిస్టేబుల్ పాత్రలో నటించారు.