దారుణం : స్కూలు పాప ని 6 నెలలుగా అత్యాచారం చేస్తున్న హెడ్ మాస్టర్

Wednesday, November 23rd, 2016, 11:41:33 AM IST

man-shado
చక్కటి విద్యని నేర్పించి, సమాజం లో గౌరవంగా బతికేలా పిల్లని తయారు చెయ్యాల్సిన ఒక ఉపాధ్యాయుడు అందునా హెడ్ మాస్టారు సమాజం తలదించుకునే పని చేసాడు. తన స్కూలు లో చదువుతున్న 12 సంవత్సారాల చిన్న పిల్ల మీద ఆరు నెలలుగా రేప్ చేస్తూ ఇన్నాళ్ళకి పట్టుబడ్డాడు. సోమవారం సాయంత్రం ఇంటికి వెళ్లిన ఆ బాధిత బాలిక కడుపునొప్పి వస్తోందంటూ తన తల్లికి చెప్పింది. అనుమానం వచ్చిన తల్లి ఆరా తీయగా అసలు విషయాన్ని చెప్పింది బాధితురాలు. కామాంధుడు అయిన హెడ్మాస్టర్ మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు బాలిక తల్లి తండ్రులు. ఈ ఘటన కర్ణాటకలోని పాతపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం రాత్రి ఆమెను బాగేపల్లి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం, చిక్కబళ్లాపూర్ లో నిన్న పరీక్షలు నిర్వహించి, మక్కళ కల్యాణ సమితికి అప్పగించినట్టు సమాచారం. మరోవైపు, నిందితుడు దుగ్గప్ప బాగేపల్లెలో ఉన్నట్టు సమాచారం అందడంతో… అక్కడకు వెళ్లిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.