మూగ జీవానికి “స్వేచ్ఛ” ఇస్తే ఎంత భావోద్వేగంగా ఉంటుందో ఈ వీడియో చూడండి.!

Wednesday, June 12th, 2019, 11:05:58 PM IST

మానవుడు నాగరికత తెలుసుకున్నప్పటి నుంచి తన అవసరాల కోసం ఇతర వస్తువులు, జీవుల పైన ఆధారపడడం నేర్చుకున్నాడు.తన ఆత్మ రక్షణ కోసం అలాగే బ్రతుకు తెరువు కోసం మూగ జీవాలను బందించుకున్నాడు. వాటి స్వేచ్ఛను భగ్నం చేస్తే వాటి బాధ ఎలా ఉంటుందో కానీ ఒక మూగ జీవానికి “స్వేచ్ఛ”ను కనుక ఇచ్చినట్టయితే అది ఎంత భావోద్వేగంగా ఉంటుందో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే అర్ధం అవుతుంది.

జేన్ గూడెల్ అనే వ్యక్తి మరియు ఆమె బృందం వన్య ప్రాణి అయినటువంటి ఒక చింపాంజీను ఒక బోనులో తీసుకొచ్చి అడవిలో విడిచి పెట్టారు.అది అలా బయటకొచ్చి ఒక రెండు సెకండ్లు ఆగి దాని పక్కనే ఉన్న ఒక మహిళ దగ్గరకి తీసుకోగా వెళ్లి ఆ తర్వాత వెనుకున్న జేన్ దగ్గరకు వెళ్లి మనుషులు ఎంతో ప్రేమతో హృదయాన్ని హత్తుకుంటే ఎలా ఉంటుందో అదే విధంగా అంతకు మించిన ప్రేమతో హత్తుకుంది.ఈ దృశ్యం చూస్తే మాత్రం మనకు కూడా భావిద్వేగం కలుగక మానదు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఈ క్రింద ఉంది ఒకసారి మీరు కూడా చూసెయ్యండి.