నీళ్ళకోసం ఫ్రిజ్ ఓపెన్ చేస్తే.. పాములు బయటపడ్డాయట..!

Wednesday, January 13th, 2016, 09:28:44 AM IST


ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ నగరంలో నివసించే ఓ మహిళ మంచినీళ్ళ కోసం ఫ్రిజ్ ఓపెన్ చేసి షాక్ తిన్నది. ఫ్రిజ్ లో అతి భయంకరమైన విషసర్పం బయటపడింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుగాని, ఆ విష సర్పం అందులో దర్శనమిచ్చింది. ఒక్క విషసర్పమే కాదు.. దానితో పాటు అందులో 15 గుడ్లు కూడా ఉన్నాయి. ఈ గుడ్లను చూసి ఆమె షాక్ తిన్నది. వెంటనే స్నేక్ స్పెషలిస్టు రోల్లీ బుర్రెల్ కు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న రోల్లి.. ఆమె ఇంటికి వచ్చి.. ఫ్రిజ్ ను ఓపెన్ చేసి పామును పట్టుకున్నాడు. అయితే, ప్రస్తుతం ఆ పాము ప్రెగ్నెంట్ కావడంతో.. ఈజీగా చిక్కింది. పైగా అప్పటికే అది 15 గుడ్లను పెట్టింది. సాధారణంగా ఈ బ్రౌన్ కలర్ స్నేక్ గుడ్లు పొదగడానికి 80 రోజుల సమయం పడుతుంది. సదరు బాధిత మహిళ కనుక ఫ్రిజ్ లో పాము ఉన్న సంగతి గుర్తించక పోయినట్టైతే ప్రమాదం తీవ్రస్థాయిలో ఉండేదని రోల్లీ అన్నాడు. ఈ బ్రౌన్ కలర్ స్నేక్స్ కారణంగా ఆడిలైడ్ లో అనేక మంది మృత్యువాత పడుతున్నారని ఆయన తెలియజేశారు.