బ్రేకింగ్ న్యూస్ : మళ్ళీ ఏపీలో భారీగా తగ్గినా కరోనా కేసులు.!

Friday, May 29th, 2020, 04:01:10 PM IST

గత కొన్ని రోజుల నుంచి ప్రతీ రోజు క్రమం తప్పకుండా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు ఈరోజు మాత్రం చాలా ఆలస్యంగా విడుదల చెయ్యడం కాస్త అనుమానం కలిగించింది. అయితే కాస్త లేట్ గానే లెక్కలను బయటపెట్టినా కాస్త మంచి వార్తే వదిలారని చెప్పాలి.

ఇన్ని రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న కేసులు కాస్తా ఇప్పుడు మళ్ళీ భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 11 వేల 638 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో కేవలం 33 కేసులు మాత్రం పాజిటివ్ వచ్చినట్టుగా రాష్ట్ర విమధ్య ఆరోగ్య శాఖ వారు నిర్ధారించారు.

దీనితో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2084 కు చేరుకోగా అదే 24 గంటల్లో భారీగా 79 మంది డిశ్చార్జ్ కాగా ఒకరు మరణించారు. మొత్తానికి ఏపీలో ఏం జరుగుతుందో కానీ ఇంత లేట్ గా వివరాలు అందివ్వడానికి గల కారణం ఏమిటి అన్నది ఇంకా తెలియరాలేదు.