టీ-కాంగ్రెస్ కి భారీ షాక్ – పార్టీ మారనున్న ఎంపీలు

Wednesday, June 12th, 2019, 11:29:36 PM IST

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ కి మరొక పెద్ద షాక్ తగలనుంది. తెలంగాణాలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎంపీలుగా ఎన్నికైనటువంటి ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీని వీడనున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి… ఆ ఇద్దరు ఎంపీలు ఎవరో కాదు… రేవంత్ రెడ్డి మరియు కోమటిరెడ్డి వెంకటిరెడ్డి… ఈ ఇద్దరు ఎంపీలు ఇప్పటికే బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని, అందుకు గాను బీజేపీ పార్టీ అధిష్ఠానంతో రహస్య మంతనాలు జరిపారని సమాచారం. వ్వెరిద్దరు ఎంపీలతో పాటు మాజీ ఎంపీ వివేక్‌, కేసీఆర్‌ అన్న కూతురు కల్వకుంట్ల రమ్య రావు కూడా బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తో భేటీ అయినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి… అయితే ఇటీవల తెరాస లో సీఎల్పీ విలీనంపై కూడా ఈ ఇద్దరు ఎంపీలు సరిగ్గా స్పందించలేదనే విమర్శలు వచ్చాయి. ఇపుడు వీరు బీజేపీ అధిష్టానంతో జరిపిన మంతనాలు ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి… ఒకవేళ ఇదే జరిగితే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగవడం ఖాయమని రాజకీయ వర్గాలు తెలిపాయి…