అందాల హేబా పటేల్ కి కోపం వస్తే ఇలా ఉంటది!

Sunday, September 24th, 2017, 11:59:07 AM IST

కుమారి 21 ఎఫ్ తో టాలీవుడ్ లో సంచలనం రేపిన హెబ్బా పటేల్ కు ఆ తరువాత వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తరువాత జోరుగా సినిమాలు చేసిన ఈ భామకు ప్రస్తుతం వరుస పరాజయాలు టెన్షన్ పెడుతున్నాయి. దాంతో రాజ్ తరుణ్ తో చేసిన అందగాడు సినిమా తరువాత ఈ అమ్మడు ఎక్కడ కనిపించడం లేదు .. అంతకంటే చేతిలో సినిమాలు లేవు అనడం కరక్ట్ .. ఇక ప్రస్తుతం చేస్తున్న ఒకే ఒక్క సినిమా ఏంజిల్ ! నాగ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తై చాల రోజులు గడుస్తున్నా కూడా విడుదల కాకపోవడంతో హెబ్బా టెన్షన్ పెట్టుకుంది. ఇందులో ఏంజిల్ గా కనిపిస్తుంది హెబ్బా.. ప్రస్తుతం గ్రాఫిక్ వర్క్ జరుగుతుండడంతో ఆలస్యం అవుతుందని చెప్పారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా విడుదలైతే మళ్ళీ తన కెరీర్ గాడిలో పడుతుందని ఆశపడుతున్న హెబ్బా .. ఏంజిల్ టీమ్ పై కాస్త స్వీట్ గానే ఫైర్ అయిందట ? షూటింగ్ ముగిసి ఆరునెలలు గడుస్తున్నా కూడా విడుదల చేయక పోవడం ఏమిటి ? అని టీమ్ పై గుర్రుగా ఉందట ? హెబ్బను ఏంజిల్ లా చూపించాలన్న టీమ్ కు రాక్షసి లా మారింది హెబ్బా !!

  •  
  •  
  •  
  •  

Comments