`హ‌లో` లైవ్ : ఇక్క‌డ ప్రీరిలీజ్‌.. అక్క‌డ ఆడియో లాంచ్‌..

Wednesday, December 6th, 2017, 05:47:27 PM IST

అక్కినేని అఖిల్ క‌థానాయ‌కుడిగా విక్ర‌మ్‌.కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ `హ‌లో` ఈనెల 22న అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే యూనిట్‌ ప్ర‌మోష‌న‌ల్ హీట్ పెంచేసింది. ఈ సినిమా ఆడియో వేడుక‌ను విశాఖ‌ప‌ట్నంలో అత్యంత వైభ‌వంగా నిర్వ‌హిస్తున్నామ‌ని కింగ్ నాగార్జున తెలిపారు. అలాగే ప్రీరిలీజ్ వేడుక‌ను హైద‌రాబాద్‌లో అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు.

అన్న‌పూర్ణ ఏడెక‌రాల్లో జ‌రిగిన ఓ స‌మావేశంలో హ‌లో నిర్మాత‌, కింగ్ నాగార్జున మాట్లాడుతూ -“హ‌లో యాక్ష‌న్ కం రొమాంటిక్ ల‌వ్‌స్టోరి. విక్ర‌మ్‌.కె ఎంతో బాధ్య‌త‌గా తెర‌కెక్కిస్తున్నాడు. ఓ మ్యాజిక్ ఎలా జ‌న‌రేట్ చేయాలి? అన్న‌ది విక్ర‌మ్‌కి బాగా తెలుసు. ఆ విష‌యంలో పెద్ద స‌క్సెస‌య్యాడు. వైజాగ్ ఎంజిఎం గ్రౌండ్స్‌లో ఆడియో వేడుకను అట్ట‌హాసంగా నిర్వ‌హించ‌నున్నాం. హైద‌రాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక‌ను అంతే ఘ‌నంగా ఏర్పాటు చేస్తున్నాం. విశాఖ‌లో జ‌రిగే ఆడియో ఈవెంట్‌లో అఖిల్ లైవ్ పెర్ఫామెన్స్ ఇస్తాడు. అభిమానుల కోరిక మేర‌కు అఖిల్ స్టేజీపై డ్యాన్సులు చేయ‌డానికి ఒప్పుకున్నాడు“ అని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments