సినిమా ఫ్లాపయినా అంతర్జాతీయ అవార్డు కొట్టిన “హలో”

Tuesday, May 15th, 2018, 11:51:31 PM IST

అందరికీ తెలిసిన చిన్న నాటి సిసింద్రీ. అదేనండీ అక్కినేని అఖిల్. మనం సినిమాతో తెలుగు చిత్ర సీమకు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ సినిమాల విషయానికి వస్తే హిట్టు దక్కించుకోలేకపోతున్నాడు. తాజాగా అఖిల్ హీరోగా నటించిన హలో సినిమా కూడా అంచనాలను మించకుండా ఫ్లాపుపై నిలిచింది. కానీ ఈ సినిమా విషయానికొస్తే అఖిల్ పర్ఫమేన్సు అద్భుతం అని చెప్పుకోవాల్సిందే. సినిమాలోని నటన ఒక్కటే కాకుండా అఖిల్ చేసిన స్టంట్లు కూడా అదరహో అనిపించాయి. అయితే ఆ స్తంట్లను చూసే అఖిల్ హలో సినిమాకు ఓ గొప్ప గౌరవం దక్కింది. ఏమిటా అనుకుంటున్నారా.? వరల్డ్ స్టంట్ అవార్డ్స్ లో విదేశీ సినిమా కేటగిరీలో అఖిల్ ‘హలో’ బెస్ట్ యాక్షన్ చిత్రంగా నామినేట్ అయింది.

అంతర్జాతీయ స్టంట్స్ అవార్డ్స్ లో ఒక తెలుగు చిత్రానికి ఇంతటి అరుదైన గౌరవం దక్కడం నిజంగా గొప్ప విషయమే అనుకోవాలి. అయితే ఈ విషయాన్ని విక్రమ్ కే కుమార్ తన ట్విట్టర్ ద్వారా విదేశీ కేటగిరీలో ఈ సినిమా నామినేట్ అయినందుకు చాలా గర్వంగా ఉందని సినీ ప్రముఖులైన నాగార్జున, అనూప్ రూబెన్స్, బాబ్ బ్రౌన్, పీఎస్ వినోద్, ప్రవీణ్ పూడిలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. అందరి మన్నలను, అభిమాన్ని అందుకున్న కథానాయిక కల్యాణి ఈ చిత్రానికి కథానాయికగా నటించిన విషయం విదితమే.

  •  
  •  
  •  
  •  

Comments